Wednesday, April 30, 2025
Homeజాతీయంప‌హ‌ల్గామ్ లో ఉదార‌త చాటుతున్న కశ్మీరీలు

ప‌హ‌ల్గామ్ లో ఉదార‌త చాటుతున్న కశ్మీరీలు

నవతెలంగాణ – హైదరాబాద్: ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో అక్క‌డి వ్యాపారులు ఉదార‌త‌ను చాటుతున్నారు. భ‌యంతో బిక్కుబిక్కుమంటున్న ప‌ర్యాట‌కుల‌కు ఉదారంగా సాయం చేస్తున్నారు. ట్యాక్సీవాళ్లు, ఆటో డ్రైవ‌ర్లు ఉచితంగానే సంద‌ర్శ‌కుల‌ను గ‌మ్య‌స్థానాల‌కు చేరుస్తున్నారు. మ‌రికొంద‌రు స్థానికులు ప‌ర్యాట‌కుల‌కు ఉచితంగా ఆశ్ర‌యం క‌ల్పిస్తున్నారు. “ఇది కేవ‌లం సంద‌ర్శ‌కుల మీదే కాదు… క‌శ్మీర్ ఆత్మ‌పై ఉగ్ర‌వాదులు జ‌రిపిన దాడి. ప‌ర్యాట‌కులు మాకు అతిథులుగా వ‌చ్చారు. ఇప్పుడు భ‌యంతో బిక్కుబిక్కుమంటూ వెళుతున్నారు. ఇది చాలా బాధ‌గా అనిపిస్తోంది. న‌వ దంప‌తులు భ‌యంతో వ‌ణుకుతూ వ‌చ్చి ఎయిర్‌పోర్టుకు ఎలా వెళ్లాల‌ని అడిగారు. వారిని సుర‌క్షితంగా విమానాశ్ర‌యంలో దిగబెట్టాను. ఆ స‌మ‌యంలో వారు నాకు డ‌బ్బులిచ్చేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ, అలాంటి ప‌రిస్థితుల్లో వారి వ‌ద్ద నేను డ‌బ్బులు ఎలా తీసుకోగ‌ల‌ను” అని బిలాల్ అహ్మ‌ద్ అనే ఆటోడ్రైవ‌ర్ ఓ మీడియా ఏజెన్సీతో మాట్లాడుతూ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img