Wednesday, April 30, 2025
Homeతాజా వార్తలుపాకిస్తానీయులు దేశం విడిచిపోవాలి

పాకిస్తానీయులు దేశం విడిచిపోవాలి

– డీజీపీ జితేందర్‌ ఆదేశాలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల ఘటనల నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉన్న 208 మంది పాకిస్తానీయులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని రాష్ట్ర డీజీపీ జితేందర్‌ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 26 మంది అమాయక టూరిస్టులను ఉగ్రవాదులు హతమార్చిన నేపథ్యంలో పాకిస్తానీయుల వీసాలను వెంటనే రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఉన్న పాకిస్తానీయుల సంఖ్యపై స్పెషల్‌ బ్రాంచ్‌తో పాటు ఇంటెలిజెన్స్‌ అధికారులు ఆరా తీశారు. ఈ మేరకు 208 మంది పాకిస్తానీయులు వివిధ వీసాలతో ఉన్నట్టు తెలిసింది. వారిలో సాధారణ వీసాతో వచ్చిన వారు ఈ నెల 27వ తేదీ లోగా, వైద్యం కోసం వచ్చిన వారు 29వ తేదీలోగా వెళ్లిపోవాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. లేనిపక్షంలో వారిపై చట్టపర చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img