నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్ 2026 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా రూ.14.2 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్‌కు ఆ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఒక వినూత్నమైన సలహా ఇచ్చారు. తొలిసారి ధోనీని కలిసినప్పుడు ఆయన క్రికెట్ గురించి కాకుండా డబ్బు పొదుపు చేసుకోవడంపై మాట్లాడారని ప్రశాంత్ వీర్ స్వయంగా వెల్లడించాడు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో స్పోర్ట్‌స్టార్‌తో మాట్లాడుతూ వీర్ ఈ విషయాన్ని తెలిపాడు. “మేమింకా క్రికెట్ గురించి పెద్దగా మాట్లాడుకోలేదు. ఆయన నాతో మాట్లాడుతూ, వచ్చిన డబ్బును అనవసరంగా ఖర్చు చేయకుండా పొదుపు చేసుకోమని చెప్పారు” అని ప్రశాంత్ వీర్ వివరించాడు. ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తీవ్రమైన పోటీ తర్వాత సీఎస్కే అతడిని దక్కించుకుంది.
ప్రశాంత్ వీర్‌కు ధోనీ కీలక సలహా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



