Monday, May 5, 2025
Homeజాతీయంబంగారం @ లక్ష..

బంగారం @ లక్ష..

- Advertisement -

– పేదల ఆలోచనకు అందనంతగా.. మధ్యతరగతి ప్రజలు కొనలేని స్థాయికి పసిడి
న్యూఢిల్లీ :
బంగారం ధర భగ్గుమంటోంది. పేదల ఆలోచనకు అందకుండా.. మధ్యతరగతి ప్రజలు కొనలేని స్థాయికి చేరింది. సోమవారం 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.1 లక్ష చేరువలో నమోదయ్యింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రతరం కావడానికి తోడు డాలర్‌ బలహీన పడడంతో పసిడికి డిమాండ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల (99 శాతం) స్వచ్ఛత కలిగిన 10 గ్రాములపై రూ.1650 ఎగిసి రూ.99,800కు చేరిందని ఆల్‌ ఇండియా సరఫా అసోసియేషన్‌ వెల్లడించింది. శుక్రవారం నాడు స్వర్ణం ధర రూ.98,150 వద్ద ముగిసింది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పసిడిపై రూ.1600 పెరిగి రూ.99,300గా పలికింది. బంగారంపై మూడు శాతం వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) అమల్లో ఉంది. పన్నులు కలుపుకుంటే లక్షపైనా చెల్లించాల్సి ఉంటుంది. గుడ్‌ రిటర్న్స్‌ ప్రకారం.. కిలో వెండిపై రూ.1000 పెరిగి రూ.1,01,000గా నమోదయ్యింది. అంతర్జాతీయ విపణిలో ఔన్సు పసిడి 3,397 డాలర్లకు చేరింది. 2025లో ఇప్పటి వరకు 10 గ్రాముల బంగారంపై ధర రూ.20,850 పెరిగింది. గతేడాది డిసెంబర్‌ 31న సుమారు రూ.79,000 వద్ద నమోదయిన అపరంజి.. గడిచిన మూడున్నర నెలల్లో 26.41 శాతం మేర పెరిగి సామాన్యులకు అందుబాటులోకి లేకుండా పోవడంతో కొనుగోలుదారుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -