Wednesday, April 30, 2025
Homeజిల్లాలుబోయగూడెంలో హనుమాన్ జయంతి వేడుకలు

బోయగూడెంలో హనుమాన్ జయంతి వేడుకలు

– శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్సీ
నవతెలంగాణ – తిరుమలగిరి సాగర్
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం, తిరుమలగిరి సాగర్ మండలం, బోయగూడెం పంచాయతీలోని అశోక్ నగర్, గరికనెట్ తండాలో నూతన సీతారామాంజనేయ స్వామి దేవస్థాన ప్రతిష్ట మహోత్సవ సందర్భంగా హనుమాన్ మాలధారణ ధరించటం జరిగింది. హనుమాన్ జయంతి సందర్భంగా స్వాములను శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి నల్లగొండ జిల్లా శాసన మండలి సభ్యులు మంకెన కోటిరెడ్డి హాజరై స్వాములకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రజలందరికీ హనుమంతుడి అనుగ్రహం కలగాలని, హనుమంతుని దయతో ప్రతి ఒక్కరూ జీవితాలు విజ్ఞానంతో నిండి ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని కలిగి, హనుమంతుని కృప ఎల్లపుడూ తెలంగాణ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బిచ్చ నాయక్, కొత్తపల్లి పిఏసియస్ డైరెక్టర్ బాలునాయక్, మాజీ సర్పంచులు రంగాసాయి నాయక్, రాములు నాయక్, మాజీ ఉప సర్పంచులు కిషోర్ నాయక్, లాలు నాయక్, రవీంద్ర గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img