Tuesday, May 20, 2025
Homeజాతీయంభార‌త్ ఆర్మీ వెబ్ సైట్ల‌పై సైబ‌ర్ ఎటాక్

భార‌త్ ఆర్మీ వెబ్ సైట్ల‌పై సైబ‌ర్ ఎటాక్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడితో ఇండియా-పాక్ దేశాల ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెలకొన్న విష‌యం తెలిసిందే.. ఈ దాడిని భార‌త్ ఖండించింది. దాయాది దేశంపై ప‌లు దౌత్య‌ప‌రంగా ప‌లు క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంది. భార‌త్ ఆంక్ష‌ల‌తో ష‌రిప్ ప్ర‌భుత్వం అల్లాడిపోతుంది. ఎప్పుడు ఏ వైపు నుంచి భార‌త్ ఆర్మీ.. త‌మ దేశంపై దాడి చేస్తుందోన‌ని పాక్ ప్ర‌భుత్వం బిక్కుబిక్కుమంటుంది. ఈ క్ర‌మంలో భార‌త్ సైనిక చ‌ర్య‌ల‌ను పసిగ‌ట్టేందుకు పాక్ ఆర్మీ సైబ‌ర్ దాడుల‌కు తెర‌లేపింది. భార‌త్ ఆర్మీ సంస్థ‌ల‌కు చెందిన వెబ్ సైట్‌ల‌ను హ్యాక్ చేసేందుకు విఫ‌ల ప్ర‌య‌త్నం చేసింది. కానీ పాక్ దుశ్చ‌ర్య‌ల‌ను ముందుగానే ఊహించిన ఇండియా సైబ‌ర్ టీం .. ఆ చ‌ర్య‌ల‌ను తిప్పికొట్టింది. వెంట‌నే డికొడ్ చేసి..స‌దురు వెబ్ సైట్లు హ్య‌క్ కాకుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంది. ఆర్మీకి చెందిన‌ వెల్ఫ‌ర్ అండ్ ఎడ్యుకేష‌న్‌ వ్య‌వ‌స్థ‌ల‌ను “IOK హ్యాకర్” – ఇంటర్నెట్ ఆఫ్ ఖిలాఫత్ అనే మారుపేరుతో హ్యాక్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించార‌ని అధికారులు పేర్కొన్నారు. శ్రీ‌న‌గ‌ర్, రాణిఖేత్ లోని ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్స్ , ఆర్మీ వెల్ఫ‌ర్ హోసింగ్ ఆర్గ‌నైష‌న్‌కు చెందిన వెబ్ సైట్లు అంత‌రాయనికి గురైయ్యాయి. దీంతో ఇండియా లేయర్డ్ సైబర్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ రియల్-టైమ్‌లో చొరబాట్లను గుర్తించింది. పాకిస్థాన్ కేంద్రంగా దాడుల‌కు తెగ‌బ‌డ్డార‌ని అధికారులు వెల్ల‌డించారు. త‌మ అప్ర‌మ‌త్త‌తో ఎలాంటి స‌మాచారం షేర్ కాలేద‌ని ఆర్మీ అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -