Tuesday, April 29, 2025
Homeఅంతర్జాతీయంభార‌త్‌కు చేరుకున్న యూఎస్ ఉపాధ్య‌క్షుడు

భార‌త్‌కు చేరుకున్న యూఎస్ ఉపాధ్య‌క్షుడు

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్‌కు చేరుకున్నారు. సోమవారం ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో విమానం దిగారు. ఎయిర్‌పోర్టులో ఆయనకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఘన స్వాగతం పలికారు. భారత్‌లో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా వాన్స్‌ వెంట ఆయన సతీమణి ఉషా వాన్స్, ముగ్గురు పిల్లుల కూడా వచ్చారు. జేడీ వాన్స్‌ పిల్లులు.. భారతీయ సాంప్రదాయ దుస్తులు ధరించడం విశేషం. ఎయిర్‌పోర్టులో భారత శాస్త్రీయ నృత్యంతో వారికి సాదర స్వాగతం పలికారు. కాసేపట్లో వారు ఢిల్లీలోని అక్షర్‌ధామ్‌ టెంపుల్‌కు వెళ్లనున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జేడీ వాన్స్ భారత్ పర్యటనకు రావడం ఇదే తొలిసారి. వాన్స్‌కు మన సైనిక దళాలు గౌరవ వందనం చేశాయి. సాయంత్రం 6.30 గంటలకు వాన్స్‌ దంపతులకు లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లోని తన నివాసంలో ప్రధాని మోదీ స్వాగతం పలుకుతారు. అనంతరం ఇరువురు నేతలు అధికారిక చర్చల్లో పాల్గొంటారు. ఈ క్రమంలో వాణిజ్యం, సుంకాలు, ప్రాంతీయ భద్రతతోపాటు పలు ద్వైపాక్షిక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. భేటీ అనంతరం వాన్స్‌ దంపతులు, అమెరికా అధికారులకు ప్రధాని మోదీ ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. విందు అనంతరం సోమవారం రాత్రే వాన్స్‌ దంపతులు జయపురకు వెళ్తారు. అక్కడ విలాసవంతమైన రాంభాగ్‌ ప్యాలెస్‌ హోటల్‌లో బస చేస్తారు. మంగళవారం ఉదయం పలు చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు. అందులో అంబర్‌ కోట కూడా ఉంది. మధ్యాహ్నం రాజస్థాన్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో వాన్స్‌ ప్రసంగిస్తారు. ట్రంప్‌ హయాంలో భారత్, అమెరికా సంబంధాలపై మాట్లాడతారు. ఈనెల 23వ తేదీ(బుధవారం) ఉదయం వాన్స్‌ కుటుంబం ఆగ్రాకు వెళ్లనుంది. అక్కడ తాజ్‌ మహల్‌ను, భారతీయ కళలకు సంబంధించిన శిల్పాగ్రామ్‌ను సందర్శిస్తారు. అదేరోజు మధ్యాహ్నం తర్వాత మళ్లీ వారు జయపురకు వెళ్తారు. 24వ తేదీన జయపుర నుంచి బయలుదేరి అమెరికా వెళ్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img