విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఏసీఇ’. ఈ సినిమా మే 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ డేట్‌ని తెలియజేస్తూ అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు స్పెషల్ పోస్టర్ కూడా మేకర్స్ విడుదల చేశారు. అరుముగ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, యోగి బాబు, బి.ఎస్. అవినాష్, దివ్య పిళ్లై, బబ్లూ, రాజ్‌కుమార్ తదితరులు నటించారు. ఈ చిత్రంలో విజయసేతుపతి నట విశ్వరూపాన్ని చూస్తారు అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రాన్ని 7సీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అరుముగకుమార్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇది కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని కరణ్ బహదూర్ రావత్ నిర్వహిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ పాటలు కంపోజ్ చేస్తున్నారు. సామ్ సి.ఎస్. నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఎడిటింగ్‌ను ఫెన్నీ ఆలివర్, ఆర్ట్ డైరెక్షన్‌ను ఎ.కె. ముత్తు పర్యవేక్షిస్తున్నారు.
భిన్న కథతో ‘ఏసీఇ’
- Advertisement -
RELATED ARTICLES