నవతెలంగాణ-హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఈ వారంలో 21 దేశాల్లో 110 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఇసిఎండబ్ల్యుఎఫ్ అంచనా వేసింది. వాటిల్లో పాకిస్తాన్, ఇరాన్, కువైట్, సౌదీ అరేబియా, మౌరిటానియా, ఇండియా, ఇరాక్, ఖతార్, సూడాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, దక్షిణ సూడాన్, బహ్రెయిన్, మాలి, సెనెగల్, చాడ్, ఇథియోపియా, నైజర్, ఎరిట్రియా, నైజీరియా, బుర్కినా, ఫాసోలు దేశాలు ఉన్నాయి. బుధ, గురువారాల్లో 49 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఇసిఎండబ్ల్యుఎఫ్ (యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం-రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్స్) నివేదిక తెలిపింది. ఈ వారాంతానికి రెండు మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగి 50 డిగ్రీల మార్క్‌ను దాటే అవకాశం ఉందని ఎసిఎండబ్ల్యుఎఫ్ అంచనా వేసింది. ఇక చైనాలో కూడా వేడిగాలలు వీచే అవకాశం ఉందని తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌లలో 38 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ఇసిఎండబ్ల్యుఎఫ్ పేర్కొంది.పాకిస్తాన్‌లో ఎండలు మండుతున్నాయి. ఆ దేశంలో గత వారంలో దక్షిణ పాకిస్తాన్‌లో 48 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని.. బహుశా 50 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పాకిస్తాన్ వాతావరణ శాఖ అంచనా వేసింది. బహుశా ఈ ఏడాది కూడా 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వాషింగ్టన్ పోస్టు సూచించింది.
మండుతున్న భూగోళం
- Advertisement -
RELATED ARTICLES