– ఉగ్రవాదాన్ని ఐక్యంగా అంతమొందించాలి : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
జమ్మూలోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి అత్యంత అమానుష, హేయమైన చర్య. దేశ ప్రజలు ఐక్యంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొని టెర్రరిజాన్ని తుదముట్టించాలి. మత విభజనలు దేశానికి అత్యంత ప్రమాదకరం. ఈ విషయంలో సంయమనం పాటించాలి. ఘటనపై కేంద్ర ప్రభుత్వం లోతైన దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించాలి” అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, కాశ్మీర్ పోలీస్, మిలటరీ, నిఘా వ్యవస్థలన్నీ కేంద్ర ప్రభుత్వ చేతుల్లో ఉన్నాయని, భద్రత ఏర్పాట్లు ఎందుకు తగు రీతిలో చేయలేదని, ఆ వైఫల్యాలపై బాధ్యత కేంద్ర ప్రభుత్వ పాలకులేదనని అన్నారు. ఘటన జరిగిన తర్వాత మతకల్లోలాలు, విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం దారుణమన్నారు. ఉగ్రవాదులకు కులం, మతం లేదని, విధ్వంసం తప్ప మరేది లేదని చెప్పారు. ఉగ్రవాదాన్నీ అంతం చేయడం కోసం ప్రపంచ దేశాలు సైతం సహకరించుకుంటున్న విషయం మర్చిపోకూడదన్నారు. పర్యాటకులు వెళ్తేనే కాశ్మీర్ ప్రజలకు భవిష్యత్తు ఉంటుందని, ఇప్పుడు నిఘా వర్గాల వైఫల్యాల కారణంగా వారి ఉపాధిని దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. మతసామరస్యాన్ని కోరుకుంటున్న కాశ్మీరులపై మతం పేరుతో ఉగ్రవాద ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
బీజేపీ
ఎంపీ, ఎమ్మెల్యేలు ఉన్నా.. అభివృద్ధి సున్నా
ఉమ్మడి రాష్ట్రంలోనే లేని విధంగా తెలంగాణలో 8మంది ఎంపీలు, 8మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో బీజేపీ ప్రజాప్రతినిధులు పూర్తిగా వైఫల్యం చెందారని వీరయ్య అన్నారు. గతంలో రెండు సింగరేణి బొగ్గు బ్లాక్‌లను అమ్మిన బీఆర్‌ఎస్‌కి, కాంగ్రెస్, బీజేపీకి తేడా ఏమీ లేదన్నారు. వరి కొనుగోలు సెంటర్లలో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. యాజమాన్యాలపై ప్రేమతోనే కనీస వేతనాలు పెంచలేదని విమర్శించారు. అంగన్వాడీలకు వేసవి సెలవులు ప్రకటించాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గిట్ల ముకుందరెడ్డి, గుడికందుల సత్యం, జి.బీమా సాహెబ్, జిల్లా కమిటీ సభ్యులు యు.శ్రీనివాస్, డి.నరేష్ పటేల్ తదితరులు ఉన్నారు.
మత విభజనలు దేశానికి ప్రమాదకరం
- Advertisement -
RELATED ARTICLES