Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంమతపరంగా సీరియల్‌ నేరస్థుడు

మతపరంగా సీరియల్‌ నేరస్థుడు

- Advertisement -

– ఎంపీ నిషికాంత్‌ దూబేపై బీజేపీ చర్యలు తీసుకోవాలి : సీపీఐ (ఎం) నేత బృందా కరత్‌
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు పైన, కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్‌ ఖురేషీ పైన బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే చేసిన వ్యాఖ్యలపై సీపీఐ (ఎం) నాయకురాలు బృందా కరత్‌ మండిపడ్డారు. ఆయన వరుసగా మతపరమైన నేరాలకు పాల్పడుతుం టాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. దూబే ప్రకటనలతో తమకేమీ సంబంధం లేదని బీజేపీ అధ్యక్షుడు నడ్డా అనటం తప్పించుకోవటానికే అని బృందా ఆరోపించారు. మతపరమైన అంశాలతో రాజకీయం చేయటమే కాదు. నోటికివచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తున్న దూబేపై చర్య తీసుకోవాలని బీజేపీని కోరారు. బృందా కరత్‌ సోమవారం ఏఎన్‌ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ‘ఆయన మతపరంగా సీరియల్‌ నేరస్థుడు. మొదట సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై మతపరమైన అపవాదులు వేయడం ద్వారా సుప్రీంకోర్టుపై దాడి చేశారు. ఇప్పుడేమో మతపరమైన పరుష పదాలతో మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై దాడి చేశారు. ఆయన వ్యాఖ్యలతో సంబంధం లేదని బీజేపీ చెప్పుకున్నంత మాత్రాన సరిపోదు. ఆయనపై చర్య తీసుకోవాలి’ అని అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad