Wednesday, April 30, 2025
Homeజాతీయంమ‌హారాష్ట్రలో అడుగంటిన చేతిపంపులు

మ‌హారాష్ట్రలో అడుగంటిన చేతిపంపులు


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఒకవైపు ఎండలు మండిపోతుంటే.. మరోవైపు నీటి కష్టాలు మొదలయ్యాయి. మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో తాగునీటి కోసం జనం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క బిందె నీటి కోసం మహిళలు రెండు మూడు కిలోమీటర్ల మేర నడిచి.. పొలాల్లో ఉన్న బావిలోని నీటిని తెచ్చుకుంటున్నారు. దగ్గరలోని చేతిపంపులు అడుగంటడంతో ప్రజలు పొల్లాల్లో ఉన్న బావులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. నీటిని నడిచి తెచ్చుకోలేని వాళ్లు… కొద్దిపాటి నీటికే రూ.60లు పెట్టి కొనుక్కోంటున్నట్లు బోరిచివారి గ్రామ సర్పంచ్‌ తెలిపారు. సరైన రోడ్లు లేక, వాహనాలు లేక ఎండలో రోజూ 7-8 కిలోమీటర్ల మేర నడిచి నీటిని తెచ్చుకోవాలంటే తానెంతో ఇబ్బందిపడుతున్నట్లు ఓ మహిళ మీడియాకు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img