Tuesday, April 29, 2025
Homeతాజా వార్తలుముంబాయి ఈడీ ఆఫీస్‌లో అగ్నిప్ర‌మాదం

ముంబాయి ఈడీ ఆఫీస్‌లో అగ్నిప్ర‌మాదం

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: మ‌హారాష్ట్రలోని ఈడీ ఆఫీసులో ఆదివారం భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ముంబాయిలోని బల్లార్డ్ పీర్‌లో ఉన్న ఎన్స‌ఫోర్స్ మెంట్ డైరెక్ట‌ర్ కార్యాల‌యంలో..తెల్ల‌వారుజామున 2.30గంట‌ల‌కు ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయ‌ని అధికారులు చెప్పారు. భారీగా ఎగిసిప‌డుతున్న మంట‌ల‌ను అదుపు చేయ‌డానికి 12 ఫైర్ ఇంజ‌న్లు తీవ్రంగా శ్ర‌మిస్తున్నాయి. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌ను ఇంకా తెలియ‌రాలేద‌ని అధికారులు తెలిపారు. ప్ర‌మాద స‌మ‌యంలో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింద‌న్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img