నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ భారత్ పర్యటన ముగిసింది. జె.డి. వాన్స్ తన భార్య, ముగ్గురు పిల్లలు గురువారం జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో వాషింగ్టన్‌కు బయలుదేరినట్లు అధికారులు గురువారం తెలిపారు. సోమవారం రాత్రి వాన్స్ కుటుంబం ఢిల్లీ నుండి జైపూర్ చేరుకుంది. మంగళవారం రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో దౌత్యవేత్తలు, మేధావులను ఉద్దేశించి అమెరికా- భారత్ సంబంధాలపై ప్రసంగించారు. అంతకు ముందు ఆయన కుటుంబసమేతంతగా అంబర్ కోటను సందర్శించారు. జైపూర్ చేరుకోవడానికి ముందు బుధవారం ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను కూడా సందర్శించారు. వాన్స్ సోమవారం ఢిల్లీలోని అక్షర్‌ధామ్ ఆలయ సందర్శనతో తన భారత పర్యటనను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అంనతరం ప్రధాని మోడీతో సమావేశమయ్యారు.
ముగిసిన అమెరికా ఉపాధ్యక్షుని పర్యటన
- Advertisement -
RELATED ARTICLES