Tuesday, April 29, 2025
Homeతాజా వార్తలుముగిసిన ఎస్‌ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్‌..

ముగిసిన ఎస్‌ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్‌..

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్బీసీ) సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్‌ ముగిసింది. 58 రోజుల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్‌లో ఆరుగురు కార్మికుల ఆచూకీ లభించలేదు.సుదీర్ఘంగా సాగిన రెస్క్యూ ఆపరేషన్లో రెండు మృతదేహాలను మాత్రమే వెలికితీశారు. ఫిబ్రవరి 22న జరిగిన ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌ ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకున్న సంగతి తెలిసిందే. దేశంలోనే నైపుణ్యం కలిగిన 12 సంస్థల బందాలు సహాయక చర్యలు చేపట్టాయి. మార్చి 9న గురుప్రీత్‌ సింగ్‌ మతదేహాన్ని కనుగొన్నారు. ఇక మార్చి 22న ప్రాజెక్టు ఇంజినీర్‌ మనోజ్‌ కుమార్‌ మతదేహాన్ని బయటికి తీసుకొచ్చారు. అప్పటినుంచి రెస్క్యూ ఆపరేషన్‌ కొసనాగుతున్నా.. మరో ఆరుగురు కార్మికుల ఆచూకీ తెలియరాలేదు. టన్నెల్లో 281 మీటర్ల మేర పేరుకుపోయిన మట్టి, రాళ్లు, టన్నెల్‌ బోరింగ్‌ యంత్రం (టీబీఎం) భాగాలను బయటకు తరలించారు. మరో 43 మీటర్లను డేంజర్‌ జోన్‌ గా గుర్తించారు. ఈ జోన్కు సమీపంలో సహాయక చర్యలు కొనసాగాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img