నవతెలంగాణ-హైదరాబాద్ : అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ – 2024 తుది ఫలితాలు వచ్చేశాయి. ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం మధ్యాహ్నం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటారు.
టాప్ 10 ర్యాంకర్లు వీరే..
శక్తి దుబే తొలి ర్యాంకుతో సత్తా చాటగా.. హర్షిత గోయల్ (2), అర్చిత్ పరాగ్ (3), షా మార్గి చిరాగ్(4), ఆకాశ్ గార్గ్ (5), కోమల్ పునియా(6), ఆయుషీ బన్సల్(7), రాజ్‌కృష్ణ ఝా(8), ఆదిత్య విక్రమ్ అగర్వాల్ (9), మయాంక్ త్రిపాఠి(10) ర్యాంకుల్లో మెరిశారు.
సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు వీరే..
సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి సత్తా చాటిన విద్యార్థుల్లో ఇ.సాయి శివాని 11వ ర్యాంకుతో మెరవగా.. బన్నా వెంకటేశ్‌కు 15వ ర్యాంకు, అభిషేక్ శర్మ 38, రావుల జయసింహారెడ్డి 46, శ్రవణ్‌కుమార్ రెడ్డి 62, సాయి చైతన్య జాదవ్ 68, ఎన్ చేతనరెడ్డి 110, చెన్నంరెడ్డి శివగణేష్ రెడ్డి 119, చల్లా పవన్ కల్యాణ్ 146, ఎన్.శ్రీకాంత్ రెడ్డి 151, నెల్లూరు సాయితేజ 154, కొలిపాక శ్రీకృష్ణసాయి 190వ ర్యాంకులతో అదరగొట్టారు.
యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు..టాప్-10 ర్యాంకర్లు వీరే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES