నవతెలంగాణ-కామారెడ్డి: పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. గురువారం ఉదయం న్యూఢిల్లీలో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్యూసి) సమావేశానికి రాహుల్ గాంధీ చేరుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ అమెరికా పర్యటన రద్దు సంబంధించిన ప్రకటనను ఎక్స్ లో పోస్ట్ చేశారు. మంగళవారం జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో కనీసం 26 మంది మరణించారు. ముఖ్యంగా, పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సౌదీ అరేబియా పర్యటనను, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు.
- Advertisement -