నవతెలంగాణ-హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత మొదటిసారి కేంద్ర కేబినెట్ ఏప్రిల్ 30న సమావేశం కానుంది. బుధవారం ఉదయం 11.00 గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశం జరగనుంది. గతవారం కేబినెట్ సమావేశం కాలేదు. ఏప్రిల్ 23న సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ (సిసిఎస్) పుల్వామా దాడిని ఖండించింది. సిసిఎస్ సమావేశం అనంతరం భారత్ పాకిస్థాన్‌తో దౌత్య సంబంధాల తగ్గింపుతో పాటు పలు చర్యలను చేపట్టిన సంగతి తెలిసిందే.
- Advertisement -