Tuesday, May 6, 2025
Homeజాతీయంవ‌క్ఫ్ పిటిషన్‌ల‌పై విచారణ మే 15కి వాయిదా

వ‌క్ఫ్ పిటిషన్‌ల‌పై విచారణ మే 15కి వాయిదా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: వక్ఫ్‌ చట్టం చెల్లుబాటును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ కేసు విచారణను మే 15న జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ధర్మాసనం ఎదుట ప్రస్తావించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. త్వరలోనే జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పిటిషన్లు కొత్త సీజేఐ ధర్మాసనం ఎదుట విచారించాలని నిర్ణయించింది. ప్రస్తుత సీజేఐ సంజీవ్‌ ఖన్నా ఈ నెల 13న పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే. వక్ఫ్‌ చట్టం రాజ్యాంగ చెల్లుబాటు సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో 70 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇప్పటికే కేసును ఏప్రిల్‌ 17న సీజేఐ జస్టిస్‌ సంజీవ్ కన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. తాజాగా మ‌రోమారు మే15కు వాయిదా ప‌డింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -