తెలుగు వెండితెరపై మరో భక్తిరస చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవు తోంది. అనంత ఆర్ట్స్ బ్యానర్‌పై కృష్ణ ఇస్లావత్, సాయి చక్రవర్తి, కేశవర్థిని బేబీ రిషిత తదితరులు నటించిన చిత్రం ‘శివ శంభో’. తనికెళ్ళ భరణి, సుమన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నర్సింగ్ రావు దర్శకుడు. బొజ్జ రాజ గోపాల్, దోరవేటి సుగుణ నిర్మాతలు. ఈ చిత్రం ఈనెల 25న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ఘనంగా నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఎమ్మెల్సీ డా. గోరటి వెంకన్న, బీజేపీ నేత చీకోటి ప్రవీణ్, నటుడు, రచయిత తనికెళ్ల భరణి, బర్దీపుర పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వర గిరి స్వామీజీ, ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్, చిత్రపురి కాలనీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ తదితరులు పాల్గొని చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తనికెళ్ల భరణి మాట్లాడుతూ,’ఇలాంటి భక్తిరస చిత్రాలు చాలా అరుదుగా వస్తాయి. భారతీయ కళలైన సంగీతం, సాహిత్యం, నత్యం ప్రధానాంశాలుగా కలిగిన ఈ సందేశాత్మక చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించగలరనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాను’ అని అన్నారు. ’25న మా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ థియేటర్‌కు వెళ్లి చూసి, సినిమాను ఆదరించాలని కోరుతున్నాము. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. దర్శకుడు నర్సింగ్ ఎంతో శ్రమకోర్చి ఈ సినిమాను తెరకెక్కించారు’ అని చిత్ర నిర్మాతల్లో ఒకరు, రచయిత, సంగీత దర్శకులు దోరవేటి చెప్పారు.
‘శివ శంభో’ రిలీజ్‌కి రెడీ
- Advertisement -
RELATED ARTICLES