Wednesday, April 30, 2025
Homeసినిమాసమాజానికి ఉపయోగపడే సినిమా

సమాజానికి ఉపయోగపడే సినిమా

దర్శకుడు బాబ్జీ రూపొందించిన నూతన చిత్రం ‘పోలీస్‌ వారి హెచ్చరిక’. తూలికా తనిష్క్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మాత బెల్లి జనార్థన్‌ నిర్మించారు. ఈ సినిమా ఆడియో లాంచ్‌ ఈవెంట్‌ని మేకర్స్‌ ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకకు విశిష్ట అతిథులుగా హాజరైన పలు వామ పక్ష పార్టీల నేతలు కూనంనేని సాంబశివరావు, ఎంఎల్‌సి సత్యం, సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్‌ వెస్లీ మాట్లాడుతూ,’వామ పక్షాల ఐక్యతను చాటేలా ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌కు మేం హాజరయ్యాం. ఒక గొప్ప సామాజిక లక్ష్యంతో మా ప్రజా నాట్యమండలి బాబ్జీ రూపొందించిన ఈ సినిమాను జనంలోకి తీసుకెళ్లి దీనిని విజయవంతం చేయాలని, తద్వారా రాబోయే రోజులలో ప్రజలకు ఉపయోగపడే ఇటువంటి చిత్రాలు మరిన్ని రావడానికి రెండు రాష్ట్రాలలోని మా పార్టీలు, ప్రజా సంఘాల సభ్యులు, అభిమానులు కషి చేయాలని మేం
ఈ వేదిక నుంచి సంయుక్తంగా పిలుపు ఇస్తున్నాం’ అని అన్నారు.
ఆర్‌. నారాయణ మూర్తి మాట్లాడుతూ, ‘ప్రజా నాట్యమండలి వేదిక నుంచి వచ్చిన బాబ్జీ తీసిన ఈ సినిమా గురించి విన్నప్పుడు ఇది సమాజానికి ఉపయోగపడే అద్భుతమైన సినిమా అని అర్థమయ్యింది . ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో రావాలి. ఈ సందేశాత్మక చిత్రం ఘన విజయం సాధించాలి. బాబ్జి మంచి సినిమా తీయడం కోసం ఎంత టైం అయినా తీసుకొని ఆ సినిమా బాగా వచ్చే వరకు కష్టపడతారు. ఇప్పుడు ఆయన బిడ్డతో ఇంత మంచి సినిమా తీశారు’ అని అన్నారు.
తనికెళ్ళ భరణి, తమ్మా రెడ్డి భరద్వాజ, జయసుధ, అజరు ఘోష్‌ తదితరులు ఈ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img