Thursday, August 14, 2025
EPAPER
spot_img
HomeNewsస్పెషల్ డ్రైవ్ ద్వారా 150 పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీ...

స్పెషల్ డ్రైవ్ ద్వారా 150 పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీ…

- Advertisement -

– బాధితులు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి పోగొట్టుకున్న మొబైల్ పొందవచ్చు: జిల్లా యస్ పి  యం. రాజేష్ చంద్ర
నవతెలంగాణ –  కామారెడ్డి  
 సెల్ ఫోన్ పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని  సి ఈ ఐ ఆర్ ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర,  అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పోగొట్టుకున్న, చోరికి  గురైన 150  మొబైల్ ఫోన్లను  ( సుమారు  25  లక్షల విలువగల) స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించడం జరుగుతుంది అని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పోయిన సెల్ ఫోన్ పట్ల  అశ్రద్ధ చేస్తే ఇది వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు. మొబైల్ పోయిన లేదా చోరీకి గురైన వెంటనే సంబంధిత పోలీసు స్టేషన్ కు వెళ్ళి దరఖాస్తు ఇవ్వాలనీ, సిమ్  కార్డ్ బ్లాక్ చేసి అదే నంబరు గల కొత్త సిమ్ తీసుకోవాలి. తద్వారా పోయిన మొబైల్ ఫోన్ల  ఐ ఎం ఈ ఐ  వివరాలను సీఈఐఆర్  వెబ్సైట్ లో బ్లాక్ చేయడం వలన  పోగొట్టుకున్న మొబైల్  సులబంగా దొరికే అవకాశం ఉన్నదన్నారు. 

 జిల్లా పోలీసు కార్యాలయములో పోయిన సెల్ ఫోన్ల రికవరీ కోసం ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఒక ఆర్ ఎస్ ఐ, 12 మంది కానిస్టేబుల్స్ తో ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరగిందని అన్నారు. గత (7) రోజులలో ఈ టీం అధికారులు 150  ఫోన్ లను రికవరీ చేయడంతో ఇప్పటి వరకు ఈ టీం అధికారులు 627 ఫోన్ లను రికవరీ చేయడం జరిగిందన్నారు.  సీఈఐఆర్ పోర్టల్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు 3551 ఫోన్ లను రికవరీ చేయడం మరియు బాధితులకు అందజెయడం జరిగింది.  ఈ సందర్భంగా 150 మొబైల్ ఫోన్ల రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన  టీం సబ్యులు అందరినీ జిల్లా ఎస్పీ  అభినందించడం జరిగింది. ఇప్పటి వరకు రికవరీ చేసిన ఫోన్ల వివరాలను బాధితులకు తెలిజేయడం జరుగుతుంది. వారు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి ఆర్ ఎస్ ఐ బాలరాజ్ ను సంప్రదించి (8712686114) ఫోన్ కు సంభంధించిన వివరాలు చూపించి తమ తమ ఫోన్ లను తీసుకోవాలన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad