Thursday, September 25, 2025
E-PAPER

హత విధీ…

- Advertisement -


నిన్న, మొన్నటి దాకా రాసుకు, పూసుకు తిరిగిన మోడీకి, తాజాగా ట్రంప్‌ ఇచ్చిన యాభై శాతం పన్నుల షాక్‌తో దిమ్మతిరిగినట్టయింది. దెబ్బకు ఐదేండ్లుగా మరిచిన చైనా తొవ్వను వెతుక్కోవాల్సి వచ్చింది. ఎప్పటిలాగే రష్యా అభయహస్తం అందించడంతో ఒకింత ధైర్యంగా ఉన్నప్పటికీ, లోలోన ట్రంప్‌ వెన్నాడుతూనే ఉన్నాడు. ప్రపంచ దిమ్మరి అయిన మోడీకీ, ఇప్పుడు ప్రధాని సీటు నిప్పులకుంపటిలా కనిపిస్తున్నది. అపరేషన్‌ సిందూర్‌లో చావుతప్పి కన్నులోట్టబోయిన చందంగా బయటపడిన ఈ ఛారువాలాకు పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి..వెనుక గొయ్యిలా తయారైంది. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని నానుడి. అదీ సరిగ్గా సరిపోతుంది మన మోడీకి. అంతా హత విధీ..
-బి.బసవవున్నయ్య

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -