నవతెలంగాణ – హైదరాబాద్: బుధవారం ఉదయం హిందూ మహాసముద్రంలో భారీ భూకంపం సంబంవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.6 గా నమోదైనప్పటికి.. ఎటువంటి సునామీ హెచ్చరిక జారీ చేయలేదు. పశ్చిమ ఆస్ట్రేలియా నైరుతి కొనపై అల్బానీకి నైరుతి దిశలో 2,069 కిలోమీటర్లు (1,283 మైళ్ళు) దూరంలో హిందూ మహాసముద్రంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే ఈ ప్రాంతంలో భూకంపం సంభవించినప్పుడు సునామీ హెచ్చరికలు జారీ చేస్తారు. కానీ ఈ సారి భూకంప కేంద్రం సుముద్రంలో 10 కిలోమీటర్ల లోతులో ఉండటంతో.. ఎటువంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. అయితే ఈ భూకంప కారణంగా ఆస్ట్రేలియాలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కానీ ఈ ప్రకంపణల వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగనట్లు తెలుస్తోంది.
హిందూ మహాసముద్రంలో భారీ భూకంపం
- Advertisement -
RELATED ARTICLES