– సర్పంచ్ బెజ్జారపు రాకేష్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత, అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో విద్యాబోధన ఉంటుందని సర్పంచ్ బెజ్జారపు రాకేష్ అన్నారు. మంగళవారం మండలంలోని కోన సముందర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్పంచ్ రాకేష్ చేతుల మీదుగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యాబోధన అందుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకొని, తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుపాల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్, ఉపాధ్యాయ బృందం, తదితరులు పాల్గొన్నారు.
అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో విద్యాబోధన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



