నవతెలంగాణ – భువనగిరి : భువనగిరి పట్టణంలో 14వ వార్డు లో హుస్నాబాద్ ఇంద్రమ్మ కాలనీ మిషన్ భగీరథ నీళ్లు నల్లాల ద్వారా ఇవ్వాలాని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ అన్నారు. బుధవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వాలని కోరుతూ నీళ్ల ట్యాంక్ వద్ద నిరసన తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ కాలనీ నిర్మించి సుమారు 15 సంవత్సరాల అవుతున్న అక్కడ మౌలిక సదుపాయాలు లేక ఇళ్లల్లో ఉండలేకపోతున్నారన్నారు. మిషన్ భగీరథ పేరుతో సుమారు అయిదు ఆరు సంవత్సరాలు ట్యాంకు పూర్తి అయినది ఇంతవరకు కృష్ణా నీళ్లు ట్యాంక్ లోకి నింపకుండా పాలకులు అధికారులు నిర్లక్ష్యం వలన అక్కడ కాలనీలోని ప్రజలు నీళ్లు లేక అనేక అవస్థలు పడుతున్నారన్నారు.
ట్యాంక్ ద్వారా దినం తప్పించి దినము ఒకటి రెండు డ్రమ్ములు మాత్రమే అందిస్తున్నారన్నారు. డ్రైనేజీ, సిసి రోడ్లు, పార్క్, స్కూల్స్ గట ఎలాంటి సౌకర్యాలు లేక నిరుపేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్నికల ముందు హామీలే తప్ప పనులు మాత్రం జరగడం లేదన్నారు. ఎమ్మెల్యే ఎంపీ గట ప్రత్యేకమైన నిధులతో కాలనీ అభివృద్ధి చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నామన్నారు. వెంటనే మొదటి ప్రాధాన్యతగా నీళ్ల ట్యాంకు నింపి నల్లాలకు ద్వారా ప్రతి ఇంటికి నీళ్లు అందించి ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యవర్గ సభ్యులు గంధ మల్ల మాతయ్య, వోల్దాస్ అంజయ్య, కాలనీ శాఖ కార్యదర్శి అప్పల రాములు, పల్లెపాటి జయమ్మ , గంగారపు సుదర్శన్, ఊదరి ఎల్లయ్య, జిన్నా నరసింహ, వోల్దాస్ కవిత, వల్దాస్ ఇందిరా కాలనీవాసులు పాల్గొన్నారు.



