ఎంపీడీవో జయరాం నాయక్
నవతెలంగాణ – నవాబు పేట
అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా మంగళవారం మండల కేంద్రములోని వివిధ కార్యాలయాలలో వివిధ గ్రామాలలో కొందరు అధికారులు పాల్గొనక పోవడం వల్ల వచ్చిన వార్తలపై ఎంపిడిఓ జయరాం నాయక్ స్పందించారు. ఈ క్రమంలో అంబేద్కర్ జయంతి వేడుకలకు హాజరుకాని అధికారులపై చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు సేకరించి హాజరుకాని అధికారులకు మేము జారీచేసి అధికారికంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి రచించిన రాజ్యాంగం ప్రకారంగానే కల్పించిన రాజ్యాంగ ఫలాలు హక్కులు ప్రతి రంగంలోనూ ఆ మహనీయుని కృషి ఉందని తెలియజేశారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి జయంతికి అధికారిక కార్యక్రమాలలో పాల్గొనకపోవడం చాలా ముర్కపు చర్య అని హెచ్చరించారు. ఇక మునుముందు అధికారులు ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనాలని సూచించారు.
అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొనని అధికారులపై చర్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



