Thursday, April 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పంట మార్పిడిలో భాగంగా కూరగాయలు సాగు చేయాలి

పంట మార్పిడిలో భాగంగా కూరగాయలు సాగు చేయాలి

- Advertisement -

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
పంట మార్పిడిలో భాగంగా రైతులు కూరగాయల పంటలను సాగు చేసినట్లు అయితే అధిక ఆదాయం పొందవచ్చు అని జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారి తీగల నాగయ్య అన్నారు.జిల్లా సంయుక్త కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం కూరగాయలు సాగు పై ఉద్యాన వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి, పత్తి, మొక్కజొన్న, పం టలకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్, పండ్లు, కూరగాయలు, మునగ, పూలు, మల్బరీ, తేనెటీగల పెంపకం, పుట్టగొడుగుల పెంపకం మొదలైన మార్కెట్ డిమాండ్ ఉన్న వాటిని సాగు చేసేందుకు గాను పలువురిని ఎంపిక చేసి ఇటీవల కొండా లక్ష్మ ణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో రాష్ట్ర స్థాయిలో శిక్షణ ఇచ్చారని తెలిపారు. ఉద్యాన వలం టీర్లు కూరగాయలు, ఆయిల్ పామ్, మునగ, మల బరీ తదితర మార్కెట్ డిమాండ్ ఉన్న పంటల సాగు లో తోటి రైతులకు స్వచ్ఛందంగా సహాయ, సహ కారాలు అందిస్తారన్నారు.

 ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు సద్వినియోగం చేసుకొని కూరగాయల సాగును ఎక్కవ విస్తరణం లో చేయాలన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త సి హేచ్ నరేష్ గౌడ్ మాట్లాడుతూ తక్కువ మొత్తాడులో ఎరువులు, పురుగు మందులు వాడాలని,రైతులు నీటి, భూసార పరీక్షలు చేయించుకోవాలని, ప్రకృతి సేద్యం అవలంభించాలని సూచించారు. కార్యక్ర మంలో ప్రాంతీయ ఉద్యాన అధికారులు కే స్వాతి, పై అనిత, ప్రదీప్తి, ప్రమిత , ఉద్యాన విస్తరణ అధికారులు, రంగు ముత్యంరాజు, సుధాకర్ రెడ్డి, అనిల్, లింగారెడ్డి, ఇస్మాయిల్, రాము, ప్రభాకర్, రైతులు సౌనయ్య, శ్రీరామలు, హుసేన్ బాబురావు అప్పి రెడ్డి, మల్లయ్య పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా రైతులకు కూరగాయల విత్తనాలు పంపిణి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -