- Advertisement -
నవతెలంగాణ – ఆలేరు టౌన్
తెలంగాణ ప్రజానాట్యమండలి కోలాట కళాకారులకి రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని,తెలంగాణ ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్క వెంకటేష్ అన్నారు. ఆలేరు పట్టణంలో శుక్రవారం సిపిఐ పార్టీ కార్యాలయంలో కళాకారుల సమావేశం ప్రజానాట్యమండలి సభ్యులు జ్యోతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కళాకారులందరికీ గుర్తింపు కార్డు ఇవ్వాలని, కళాకారులను ఆదుకోవాలని, కళాకారులందరికి బ్యాంకులలో వడ్డీలేని రుణాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కళాకారులు వరలక్ష్మి, నాగమణి, సంధ్య, మైసమ్మ, సోమ నరసమ్మ, ఎల్లమ్మ, వీరమని, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



