Friday, April 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతన్నలు చిరుధాన్యాల సాగుపై ప్రాధాన్యత ఇవ్వాలి 

రైతన్నలు చిరుధాన్యాల సాగుపై ప్రాధాన్యత ఇవ్వాలి 

- Advertisement -

ఐఐఎంఆర్ ప్రశాంత్
నవతెలంగాణ – మిడ్జిల్

చిరుధాన్యాల పంటల సాగుపై రైతులు ప్రాధాన్యత ఇవ్వాలని, ఐఐఎంఆర్  ప్రశాంత్, వీరిశెట్టి మహిళా రైతులకు చెప్పారు. శుక్రవారం మండలంలోని కొత్తూరు గ్రామంలో దుందిబి ప్రాజెక్టు కంపెనీకిఐ సి ఏ ఆర్, ఐఐఎంఆర్ సహకారంతో మిల్లెట్ ప్రాసెసింగ్ మెషిన్స్ అందజేశారు. ఈ సందర్భంగా మహిళా రైతులకు మిల్లెట్ ప్రాసెసింగ్ మెషిన్స్ ట్రైనింగ్ లో రాగి తో రవ్వ తయారు చేయడం, అలాగే జొన్నలతో రవ్వ తయారు చేయడం, మహిళలకు ట్రైనింగ్  ఇచ్చారు.

మిల్లెట్స్ ధార మహిళలకు ప్రయోజనాలను వివరించారు. మహిళలందరూ కూడా ఈ శిక్షణ  ద్వారా చిరుధాన్యాలపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. దుందిబి ప్రాజెక్టుకు ఇంత అవకాశం కల్పించిన సంస్థకు గ్రామం రైతులందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రుక్మిణి, చైర్మన్ వెంకటయ్య, సీఈఓ నరేష్,  డైరెక్టర్స్ విష్ణువాస్ రెడ్డి, నరసింహ రెడ్డి,శేఖర్ రెడ్డి, వీరభద్రయ, P కృష్ణ. మహిళలు కవిత,జ్యోతి,అంజమ్మ,భారతమ్మ,శ్రావణి,శ్రీలత మీన,జ్యోతి,మహిళలు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -