- Advertisement -
– జిల్లా గ్రామీణ అధికారి విజయ లక్ష్మి
నవతెలంగాణ-కుభీర్ : మండలంలోని ఆయా గ్రామాల్లో మహిళా సంఘాల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని జిల్లా గ్రామీణ అధికారి విజయ లక్ష్మి అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన కుభీర్ ఐకేపి కార్యాలయానికి సందర్శించారు. ఈ సందర్బంగా పీడీమాట్లాడుతూ మహిళా సంఘ భవనాలను త్వరగా నిర్మాణ పనులను ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. రుణాల మంజూరు మహిళలకు లోన్ రికవరీ పై సీసీ లు ప్రత్యేక శ్రద్దా చూడాలన్నారు. అనంతరం శిల్పకళ దామాని, ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి పలు రికార్డులను తనిఖీ చేశారు ఎంపీడీఓ గంగాసాగర్ రెడ్డి ఏపీవో హరిలాల్, ఏపిఎం దత్తాత్రి.సీసీ లు భూమన్న, విఠల్,పరశురాం, గంగాధర్, అమూల్ తదితరులు ఉన్నారు.
- Advertisement -



