- Advertisement -
– స్థలం చదును, హద్దులు గుర్తింపు
నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజకవర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులు ప్రారంభించారు. గత రెండు రోజులుగా స్థలం హద్దులు గుర్తింపు,స్థలం చదును, శుభ్రం చేసే పనులను ముమ్మరం చేసారు. ఈ పనులను ఈడబ్ల్యూఐడీసీ సాంకేతిక సలహాదారు సాంబయ్య, ఏఈ రామ్‌కుమార్ లు పర్యవేక్షిస్తున్నారు. శనివారం ఈ పనులకు పరిశీలించేందుకు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ రానున్నారు అని ఏఈ రాం కుమార్ శుక్రవారం తెలిపారు.
- Advertisement -



