- Advertisement -
- ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిగా నయం సులభం
- డా. సుమంత్ కుమార్
- నవతెలంగాణ – కామారెడ్డి
- క్యాన్సర్ వ్యాధి ఏ దశలో ఉన్నా సరైన వైద్యం ద్వారా రోగులను కాపాడవచ్చని సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సుమంత్ కుమార్ తెలిపారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యశోద ఆసుపత్రి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం వైద్య రంగంలో వచ్చిన ఆధునిక సాంకేతికతతో క్యాన్సర్‌కు సమర్థవంతమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. క్యాన్సర్ అనేక రకాలుగా ఉండే వ్యాధి అయినప్పటికీ, ప్రతి రకానికి ప్రత్యేక చికిత్స విధానాలు ఉన్నాయని వివరించారు.
- వ్యాధి నిర్ధారణ అనంతరం సంబంధిత మూడు విభాగాల వైద్యులు కలిసి రోగిని సమగ్రంగా పరిశీలించి చికిత్స అందిస్తారని తెలిపారు. నాలుగో దశలో ఉన్న క్యాన్సర్ రోగులను ఆధునిక వైద్యంతో నియంత్రించి, వారి జీవిత కాలాన్ని పెంచే అవకాశముందని చెప్పారు. క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయడం సులభమని, ప్రజలు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి బాధ్యులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



