నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్: జిల్లాలో ఏప్రిల్ 18 నుండి జనగణన మొదటి దశకు సంబంధించిన శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయని జిల్లా ప్రధాన జిల్లా జనగణన అధికారి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మొదటి దశలో భాగంగా మొత్తం 13 ఛార్జ్ లెవెల్ కేంద్రాలలో ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయని తెలిపారు. ఏప్రిల్ 18, 20, 21 తేదీలలో ఈ శిక్షణ తరగతులు కొనసాగనున్నట్లు తెలిపారు.
ఈ శిక్షణలో భాగంగా ప్రతి కేంద్రంలో ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ ఇవ్వబడుతుందని తెలిపారు. జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన విధి విధానాలు, బాధ్యతలు, సాంకేతిక అంశాలపై వారికి అవగాహన కల్పించనున్నట్లు వివరించారు.శిక్షణ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. శిక్షణకు హాజరయ్యే సిబ్బంది సమయానికి హాజరై, అందిస్తున్న మార్గదర్శకాలను అవగాహన చేసుకొని కచ్చితంగా పాటించాలని సూచించారు. జనగణన విధుల నిర్వహణలో ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా పారదర్శకంగా సెన్సెస్ నిర్వహించాలని సూచించారు



