- Advertisement -
నవతెలంగాణ-చౌటుప్పల్రూరల్: చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామపంచాయతీలో శుక్రవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరం నిర్వహించారు. సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. టీబీ ముక్త భారత్ అభియాన్లో భాగంగా 14 ఏళ్లకు పైబడిన వారికి ఛాతీ డిజిటల్ ఎక్స్రేలు తీసి,లక్షణాలున్న వారిని పరీక్షించారు.అలాగే NCD కార్యక్రమంలో భాగంగా బీపీ,షుగర్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు డా.కె. సౌజన్య,కె.సత్యనారాయణ,జి.పద్మ,ఏ. శ్రీనివాస్ రెడ్డి,కే. వెంకట్ రెడ్డి తదితరులు,ఎయిమ్స్ బృందం,ఆశా వర్కర్లు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -



