Friday, April 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కోర్టుల చుట్టూ తిప్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం

కోర్టుల చుట్టూ తిప్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం

- Advertisement -

– రైతులపై ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలి 
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
రుణమాఫీ చేయమని అడిగినందుకు కమ్మర్ పల్లి బిఆర్ఎస్ నాయకులు, రైతులపై అక్రమ కేసులతో ఇబ్బంది పెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.బాల్కొండ నియోజకవర్గంలో 52వేల మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉండగా కేవలం 22వేల మంది రైతులకు రుణమాఫీ చేసి ఇంకా 30వేల మంది రైతులకు రుణమాఫీ చేయలేదన్నారు. రైతులందరికీ రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని 

నిలదీసినందుకు కమ్మర్ పల్లి బిఆర్ఎస్ పార్టీ నాయకులను, రైతులపై అక్రమ కేసులు పెట్టి గత రెండేండ్లుగా కోర్టుల చుట్టూ తిప్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆర్మూర్ కోర్టులో కేసు హియరింగ్‌కు హాజరైన బిఆర్ఎస్ నాయకులు, రైతులు తమకు న్యాయం చేయాలని, ప్రభుత్వం వెంటనే పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేయడం సమంజసమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.

రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, వాటిని నెరవేర్చాలని ప్రశ్నించిన బిఆర్ఎస్ నాయకులు, రైతులను కోర్టుల చుట్టూ తిప్పించడం అత్యంత బాధాకరమన్నారు.ఇది రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్య ధోరణిని చూపిస్తోందని విమర్శించారు.తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులపై ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలన్నారు.పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేయాలని, రైతులను ఇబ్బందులకు గురిచేసే విధానాలను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేసారు. లేకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -