నవతెలంగాణ – ఆలేరు టౌన్
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై, తెలంగాణ ప్రజానీకానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకులు బుగ్గ నవీన్ ఆలేరు పట్టణంలో శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరాలు అవుతున్న బీజేపీ తెలంగాణ పట్ల సవతితల్లి ప్రేమ చూపిస్తూ, ఎప్పటికప్పుడు హేళన చేస్తుందని, పార్లమెంట్ సాక్షిగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజన అంశం భారత్, పాకిస్థాన్ తో పోల్చడం ఆయన ఆవివేకానికి నిదర్శనం అన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు, మేధావులు సబ్బండ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొని, 1200 మంది ఆత్మబలిదానాలు చేసుకుంటే అమరవీరుల త్యాగాలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసిన సోనియా గాంధీ నాయకత్వంలోని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. పార్లమెంట్ సాక్షిగా అమరవీరుల త్యాగాలను హేళన చేస్తూ, సబ్బండవర్గాల తెలంగాణ ప్రజలను అవమానిస్తుంటే తెలంగాణ బీజేపీ ఎంపీలు నోరుమీదపకపోగా కొందరు సమర్ధించం తెలంగాణ పట్ల వారికి ఉన్న ప్రేమ ఎలాంటిదో అర్ధం అవుతుంది అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకులు బీజేపీలో ఎంపీలు అయినంత మాత్రాన అమరుల త్యాగాలను మరిచారా అని ప్రశ్నించారు. తేజస్వి సూర్య మరియు బీజేపీ పార్టీ తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, అదేవిధంగా తేజస్వి సూర్యను పార్లమెంట్ నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.



