నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
తెలంగాణ గాన కోకిల బెల్లి లలితక్క విగ్రహ ప్రతిష్టాపన సన్నాహక సమావేశం తేదీ 19 ఏప్రిల్ 2026న యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి ఎస్ వి హోటల్ లో బెల్లి లలితక్క కుమారుడు సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బెల్లి లలితక్క అమరురాలై ఏళ్లుగడుస్తున్నా, తెలంగాణ సాధించుకున్నా తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన బెల్లి లలితక్క విగ్రహాన్ని నెలకొల్పుకోలేక పోవటం పట్ల విషాదం, విస్మయం వ్యక్తం చేశారు. బెల్లి లలితక్క త్యాగనిరతిని, పోరాట పటిమను ఎత్తిపట్టి ఆమె ఆశయాల సాధన కోసం కృషి చేయాలని అందరూ చేయి చేయి కలిపారు. ఆ క్రమంలోనే రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా అందరూ కలిసి విగ్రహ ప్రతిష్ఠాపన కోసం కృషి చేయాలని తీర్మానించారు.
విగ్రహ ఏర్పాటుకోసం గాను విగ్రహ ఎంపిక కమిటీ, విగ్రహ ఏర్పాటు స్థల ఎంపిక కమిటీ, వనరుల కమిటీ ఏర్పాటయ్యాయి. ప్రథానం..విగ్రహ సన్నాహక కమిటీ సమన్వయ కర్తలుగా బెల్లి లలితక్క కుమారుడు సూర్యప్రకాష్, జన్ని వెన్నెల వ్యవహరించనున్నారు.
బెల్లి లలితక్క జీవిత, పోరాట చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఓ పుస్తకాన్ని కూడా తీసుకురావాలని నిర్ణయించారు. పుస్తకం కోసం రచనలు, బెల్లి లలితక్కతో ఉన్న జ్ఞాపకాలు, అనుభవాలను ప్రతి ఒక్కరూ రాసి పంపాలని కోరారు. బెల్లి లలితక్క జీవిత చరిత్ర పుస్తకం కోసం బెల్లి లలితక్క తో పరిచయం ఉన్నవారు, ఆమెతో వారికున్న అనుభవాలు, జ్ఞాపకాల రచనలను, లేదా ఆమె పోరాట చరిత్రను రాసి లలితక్క కుమారుడు సూర్య ప్రకాష్ (9640923312), శ్రీనివాసా చార్య (9705755713) వాట్సాప్ నెంబర్లకు పంపాలని తెలియజేశారు.
బెల్లి లలితక్క విగ్రహ ప్రతిష్ఠాపన కమిటీ సమావేశంలో పాల్గొన్న ప్రముఖుల్లో భట్టు రామచంద్రయ్య,సామ మల్లారెడ్డి,తంగెళ్లపల్లి రవికుమార్, పూస శ్రీనివాస్, భువనగిరి శ్రీనివాస్ నేత, శ్రీనివాసా చార్యులు, దయ్యాల రామనర్సయ్య, ఏశాల అశోక్, పుట్ట వీరేష్ యాదవ్, ఎల్లముల జంగయ్య,పాశపాక మహేశ్, ఆరుముళ్ల రమేష్,శ్రీరాం మురళికృష్ణ,చిలుకల రమేష్,ఊదరి సతీష్, ఏషాల అశోక్, నక్కల చిరంజీవి యాదవ్, కైరం కొండ వెంకటేష్, భూక్యా సంతోష్ నాయక్, పాక జహంగీర్, ర్యాకల రమేష్, రాసాల బాలస్వామి, రాసాల దయాకర్, రాసాల నర్సింహా, జింకల శ్రీనివాస్ యాదవ్, మేకల బాలు, శ్రీరామ్ శరత్, ఎండి బాబు, రామ్ రాజ్, భరత్, ముక్కర్ల వెంకటేష్,శ్రీనివాస్, మహేష్, రఫియొద్దీన్, మేకల ఆంజనేయులు, శ్రీశైలం, తెలంగాణ ఉద్యమకారులు, బెల్లి లలితక్క కుటుంబ సభ్యులు, లలితక్క అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. లు పాల్గొన్నారు.



