నవతెలంగాణ – వరంగల్
మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ హయాంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అమలు తీసుకురావడం వల్లే తాను ఈ స్థాయికి ఎదిగానని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా వరంగల్ జిల్లా ఎంజీఎం సెంటర్‌లోని రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ.. దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ అని చెప్పారు. దేశ సమగ్రతను కాపాడేందుకు ఆయన ప్రాణాలర్పించారని కొనియాడారు. పారదర్శక పరిపాలన అందించడానికి సాంకేతికతను జోడించాలని నాడు రాజీవ్‌గాంధీ ఆలోచన చేశారని గుర్తు చేశారు. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు కల్పించిన దార్శనికుడన్నారు. టెలికాం రంగంతో దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్టు చెప్పారు. రాజీవ్ స్ఫూర్తితో నాడు హైదరాబాద్‌లో హైటెక్ సిటీకి పునాది పడిందన్నారు. ఆయన స్ఫూర్తితోనే తెలంగాణను ఆర్థికంగా, సామాజికంగా తమ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ముందుకు తీసుకెళ్తున్నట్టు చెప్పారు.
రాజీవ్ గాంధీ వల్లే మంత్రి స్థాయికి ఎదిగా..మంత్రి కొండా సురేఖ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES