Friday, September 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడికి పూర్వ విద్యార్థుల సత్కారం

జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడికి పూర్వ విద్యార్థుల సత్కారం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చౌడారపు రాంప్రసాద్ ను పాఠశాల పూర్వ విద్యార్థులు శుక్రవారం ఘనంగా సత్కరించారు. ఇటీవల రాంప్రసాద్ జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలలో చదివిన పలువురు పూర్వ విద్యార్థులు రాంప్రసాద్ ను శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ మాజీ అధ్యక్షులు సంజీవ్, మాజీ సర్పంచ్ చిలివేరి లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ కోనాపూర్ పాఠశాల చరిత్రలో మొదటిసారి ప్రధానోపాధ్యాయుడిగా అవార్డు పొందడం ద్వారా రాంప్రసాద్ పాఠశాలతో పాటు గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారని కొనియాడారు. భవిష్యత్తులో ఎక్కడ విధులు నిర్వర్తించిన ఆ పాఠశాలలో అత్యుత్తమ సేవలందించడం ద్వారా రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు పొందాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో  క్లస్టర్ రిసోర్స్ పర్సన్ అంజయ్య, కాంగ్రెస్ నాయకులు హన్మాండ్లు, పాఠశాల ఉపాధ్యాయులు ధర్మేందర్, భాస్కర్, అరవింద్, గీత, హిమవతి, రామకృష్ణ, రాజరాజేశ్వరీ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -