Sunday, April 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణ రైతు సంఘం భద్రాద్రి జిల్లా కమిటీ ఎన్నిక

తెలంగాణ రైతు సంఘం భద్రాద్రి జిల్లా కమిటీ ఎన్నిక

- Advertisement -


అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా వంశీకృష్ణ, అన్నవరపు సత్యనారాయణ
నవతెలంగాణ-పాల్వంచ రూరల్‌

తెలంగాణ రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కమిటీని జిల్లా మహాసభలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా ఎలమంచి వంశీకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా అన్నవరపు సత్యనారాయణ ఎన్నికయ్యారు. పాల్వంచ రూరల్‌ మండల పరిధిలోని జగన్నాధపురంలో జరిగిన సంఘం జిల్లా మూడో మహాసభలో నూతన కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎలమంచి వంశీకృష్ణ, కొక్కిరపాటి పుల్లయ్య, మర్మం సమ్మక్క అధ్యక్షవర్గంగా జరిగిన మహాసభలో 31 మందిలో కమిటీ ఎన్నికైంది. 12 మంది ఆఫీసు బేరర్‌లను ఎన్నుకున్నారు. జిల్లా కోశాధికారిగా కున్సోత్‌ ధర్మ, జిల్లా ఉపాధ్యక్షులుగా కొక్కెరపాటి పుల్లయ్య, ఎలమంచిలి రవికుమార్‌, దొడ్డ లక్ష్మీనారాయణ, వాంకుడోత్‌ గోపాల్‌, మర్మం సమ్మక్క, సహాయ కార్యదర్శులుగా కొండబోయిన వెంకటేశ్వర్లు, ఊకంటి రవికుమార్‌, సాంబశివరావు, బొల్లి సత్యనారాయణలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -