నవతెలంగాణ – భువనగిరి
బీసీ రిజర్వేషన్ బిల్ సాధన కోసం ఆగస్టు 4 5 6 తేదీలలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్ష ను విజయవంతం చేయాలని జాగృతి జిల్లా అధ్యక్షులు చందుపట్ల సుజిత్ విజ్ఞాప్తీ చేశారు. గురువారం స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నిరసన దీక్ష పోస్టర్ను విడుదల చేసి మాట్లాడారు. ఈ నిరాహార దీక్షకు యాదాద్రి జిల్లా నుండి అధిక సంఖ్యలో పాల్గొని జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమం జిల్లా ఇన్చార్జ్ జాగృతి యూపీఎఫ్ నాయకులు ఎలక్కుండా రామకోటి ప్రజాపతి, రాచమల్ల బాలకృష్ణ నాయి బ్రాహ్మణ, మరియు జాగృతి నాయకులు తంగళ్ళపల్లి శ్రీకాంత్, మంచాల సంతోష్, మచ్చ చక్రవర్తి, చిన్నం ప్రభాకర్, వెల్దుర్తి సాయినాథ్, మందువా మహేష్, భానుచందర్, మహావీర్, పాల్గొన్నారు.
జాగృతి నిరసన దీక్ష పోస్టర్ ఆవిష్కరణ.
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES