నవతెలంగాణ – దర్పల్లి
తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్ అధికారుల, కార్మిక మరియు పెన్షనర్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగుల దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ప్రధాన సమస్యలైన జూన్ రెండో తేదీ లోపు 51% ఫిట్మెంట్తో పిఆర్సి ని ప్రకటించాలి , పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి. ఆరోగ్య భద్రత కార్డులను మంజూరు చేయాలి రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ ను రద్దు చేస్తూ పాత పెన్షన్ స్కీము అమలుపరచాలి 1వ సెప్టెంబర్ 2004 కన్నా ముందు నియమితులైన ఉద్యోగులకు వెంటనే ఓపిఎస్ ప్రకటించాలి.
ఇది కాకుండా ఇంకా దీర్ఘ కాలికంగా ఉన్న 64 సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ధర్పల్లి మండల కేంద్రంలోని తాహసిల్దార్ కార్యాలయంలో టీజీ జెఎసి రాష్ట్ర శాఖ పిలుపుమేరకు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనను తెలిపి ధర్పల్లి తహసీల్దార్ గారు శ్రీమతి శాంత మేడం గారికి మెమోరండం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్పల్లి పీఆర్టీయూ బాధ్యులు వెంకట్ రాజారెడ్డి , సతీష్ కుమార్ , ప్రసన్న కుమార్ , సత్యనారాయణ , టీయన్జీఓ నాయకులు రాజీవ్ కుమార్ , తపస్ నాయకులు గంగాధర్ , గోవింద్ మండలంలో గల పెద్ద ఎత్తున ఉద్యోగ , ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



