మిలిటరి పారా మిలిటరి
పోలీసులు ఇతర రక్షకభటులు
రాజధానిని పహారా కాస్తున్నాయి
ఏదైనా శతృదేశం దాడి చేస్తున్నదా
అన్న విధాన రక్షణ చర్యలు
ఈ దేశానికి మార్గదర్శనం
చేస్తున్న బాధ్యతగల యువత
ప్రభుత్వానికి అడ్డుగా కనిపించడం
ప్రజాస్వామ్య సూచికకు దర్పణం
అష్టదిగ్బంధనం చేసినా
దూసుకొస్తున్న యువత
మద్దతిస్తున్న ప్రజానాయకులు
వీరిని ఆపగల బ్యారికేడ్లు
లాఠీలు ఇతర ఆయుధాలు
చాలకొస్తున్న తీరు చూస్తే
అంతం కానున్న నియంతల పాలనకు
అంకురార్పణ జరగడం తెలుస్తోంది
ఉద్యమకారుల్ని ప్రజాస్వామ్యవాదుల్ని
బంధించి తీసుకుపోవడానికి మాత్రం
వాహనాలు సిద్ధంగా ఉంచడం
పోరాటాల విజయ సూచికలు కదా
చరిత్ర తెలియని పాలకులు
పాఠాల్ని ఎలా నేర్చుకుంటారు
జంతర్ మంతర్ నీవే చెప్పమ్మా
చెంపలు వాయించి మరీ చెప్పవమ్మా
- జంధ్యాల రఘుబాబు
9849753298






కామెంట్లు (0)