Wednesday, April 30, 2025
Homeఆటలుఐపీఎల్‌లో చ‌రిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్‌

ఐపీఎల్‌లో చ‌రిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్‌

నవతెలంగాణ – హైదరాబాద్: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో భాగంగా మంగ‌ళ‌వారం ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ)తో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ (డీసీ) ప్లేయ‌ర్ కేఎల్ రాహుల్ చ‌రిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్యంత వేగంగా 130 ఇన్నింగ్స్‌ల్లోనే 5వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్నాడు. నిన్న‌టి ల‌క్నోతో మ్యాచ్‌లో అజేయంగా హాఫ్ సెంచ‌రీ (57) చేయ‌డం ద్వారా ఈ ఘ‌న‌త సాధించాడు. ఆ త‌ర్వాతి స్థానాల్లో డేవిడ్ వార్న‌ర్ (135 ఇన్నింగ్స్), విరాట్ కోహ్లీ (157 ఇన్నింగ్స్), ఏబీ డివిలియ‌ర్స్ (161 ఇన్నింగ్స్), శిఖ‌ర్ ధావ‌న్ (168 ఇన్నింగ్స్) ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img