Wednesday, April 30, 2025
Homeతాజా వార్తలుఐసీఐసీఐ నుంచి మేం ఎలాంటి రుణాలు తీసుకోలేదు: శ్రీధర్‌బాబు

ఐసీఐసీఐ నుంచి మేం ఎలాంటి రుణాలు తీసుకోలేదు: శ్రీధర్‌బాబు

నవతెలంగాణ – హైదరాబాద్‌: కంచ గచ్చిబౌలి భూములపై ఎలాంటి వివాదాలు లేవని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. ప్రైవేటుపరం కాకుండా 400 ఎకరాల భూమిని ప్రభుత్వం కాపాడిందన్నారు. మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ భూములు ప్రభుత్వానికి చెందినవేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినా ఏఐ వీడియోలు సృష్టించి కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. హెచ్‌సీయూ భూముల పరిసరాల్లో ఏనుగులున్నాయా? ప్రభుత్వ పనులను అడ్డుకోవాలని చూస్తున్నారు. ఐసీఐసీఐ నుంచి మేం ఎలాంటి రుణాలు తీసుకోలేదు’’ అని శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img