Wednesday, April 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలుడొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్‌కు వాడొద్దు: సివిల్ సప్లై కమిషనర్

డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్‌కు వాడొద్దు: సివిల్ సప్లై కమిషనర్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : డొమెస్టిక్ (గృహ) గ్యాస్ సిలిండర్లను హోటళ్లు, ఇతర కమర్షియల్ అవసరాలకు వాడొద్దని తెలంగాణ సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. అక్రమ వినియోగం, నిల్వ చేయడం లేదా కృత్రిమ కొరత సృష్టించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గ్యాస్ అక్రమ వినియోగంపై టోల్ ఫ్రీ నంబర్ల(1967, 180042500333)కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇప్పటివరకు జరిగిన తనిఖీల్లో రూ.2.36L విలువైన సిలిండర్లను పట్టుకున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 7 కేసులు నమోదయ్యాయని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -