Tuesday, April 21, 2026
E-PAPER
Homeజాతీయంలాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు..

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా బ్యాంక్, ఎఫ్‌ఎంసీజీ సూచీలు మెరుగైన పనితీరు కనబరిచాయి. సెన్సెక్స్ 753.03 పాయింట్లు పెరిగి 79,273.33 వద్ద, నిఫ్టీ 211.75 పాయింట్లు లాభపడి 24,576.60 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 33 పైసలు క్షీణించి 93.49గా నమోదైంది. సెన్సెక్స్ 30లో ట్రెంట్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగియగా.. బీఈఎల్, టైటాన్, రిలయన్స్, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్ షేర్లు నష్టాలను చవిచూశాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -