Tuesday, April 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వేదికలు కావాలి

ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వేదికలు కావాలి

- Advertisement -

మన్ననూరు పిహెచ్ సిని తనిఖీ చేసిన కలెక్టర్
నవతెలంగాణ – అచ్చంపేట
ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వేదికలు కావాలని ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ వైద్య సిబ్బందికి సూచించారు. అమ్రాబాద్ మండల పరిధిలోని మన్ననూరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

 భాగంగా  ఆసుపత్రి పనితీరు, వైద్య సేవల అందుబాటు, రోగులకు అందుతున్న సదుపాయాలపై సమగ్రంగా పరిశీలించారు. ఆసుపత్రిలో డాక్టర్, ఇతర వైద్య సిబ్బంది ప్రతి రోజూ విధులకు హాజరవుతున్నారా అనే విషయాన్ని తెలుసుకోవడానికి హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. సిబ్బంది సమయపాలన, విధి నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన రోగులతో కలెక్టర్ నేరుగా మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవల నాణ్యతపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చారో, డాక్టర్ పరీక్షలు ఎలా చేస్తున్నారో, చికిత్స పట్ల సంతృప్తి ఉందో లేదో ప్రశ్నించి వివరాలు సేకరించారు.

పి హెచ్ సి లో రోజువారీ అవుట్ పేషెంట్ల (ఓపీ) సంఖ్యపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగి వివరాలను ఆన్లైన్‌లో నమోదు చేయాలని, అలాగే రోగులకు ఇచ్చే చికిత్స, మందుల వివరాలను కూడా సక్రమంగా నమోదు చేయాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. రికార్డు నిర్వహణలో నిర్లక్ష్యం ఉండకూడదని హెచ్చరించారు.

తదుపరి ఆసుపత్రిలోని ల్యాబొరేటరీ, మెడికల్ స్టోర్, లేబర్ రూమ్ వంటి విభాగాలను పరిశీలించారు. అందుబాటులో ఉన్న వైద్య పరికరాలు, ఔషధాల నిల్వ, పరిశుభ్రత పరిస్థితులను సమీక్షించారు. లేబర్ రూమ్‌లో సదుపాయాలు ఎలా ఉన్నాయో.. పరిశీలించి, గత నెలలో ఎన్ని ప్రసవాలు జరిగాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని పేర్కొన్నారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అలాగే రోగుల పట్ల మానవత్వంతో వ్యవహరించి, వారికి సమయానుకూలంగా చికిత్స అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు.

ఆసుపత్రి నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించేలా పనిచేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట ఐటిడిఏ మేనేజర్ జాఫర్ హుస్సేన్, వైద్యులు ఇతర అధికారులు, గ్రామ సర్పంచ్ ఇస్లావత్ మంజుల రాజారం తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -