Tuesday, April 21, 2026
E-PAPER
Homeఖమ్మంవైరా-జగ్గయ్యపేట ప్రధాన రహదారిపై రైతుల రాస్తారోకో 

వైరా-జగ్గయ్యపేట ప్రధాన రహదారిపై రైతుల రాస్తారోకో 

- Advertisement -

మొక్కజొన్నలను రోడ్డుపై పోసి ఆందోళన
సంఘటన స్థలానికి చేరుకున్న ఏఓ, ఎస్సై
సుమారు నాలుగు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు 
మార్క్ఫెడ్ డిఎం శ్యాంకుమార్ కొనుగోలు కేంద్రాన్ని మంజూరు చేస్తున్నట్లు ప్రకటన 
ఆందోళన విరమించిన అన్నదాతలు 
నవతెలంగాణ – బోనకల్ 

మాటలతో, వినతి పత్రాలతో సమస్య పరిష్కారం కాలేదు. పోరాటం తోటే సమస్య పరిష్కారం అవుతుందని అన్నదాతలు భావించారు. ఆ విధంగానే రెండు గంటల పాటు వైరా – జగ్గయ్యపేట ప్రధాన రహదారిపై మధిర క్రాస్ రోడ్డు వద్ద రాస్తారోకో నిర్వహించి విజయం సాధించారు. సంఘటన స్థలానికి ఎస్సై పొదిలి వెంకన్న, మండల వ్యవసాయ శాఖ అధికారి పసునూరి వినయ్ కుమార్ చేరుకున్నారు. రైతులతో చర్చలు జరిపి స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు ఆందోళన విరమించేది లేదని అన్నదాతలు స్పష్టం చేశారు.

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని బోనకల్ మండల పరిధిలోని పెద్ద బీరవల్లి సొసైటీ పరిధిలో పెద్ద బీరవల్లి, జానకిపురం, సీతానగరం, గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఈ సొసైటీ పరిధిలో అన్నదాతల 1,806 ఎకరాలలో మొక్కజొన్న పంట సాగు చేశారు. దాదాపు ఈ మూడు గ్రామాలలో 50 శాతానికి పైగానే మొక్కజొన్న పంట కల్లాలలో ములుగుతుంది. ఒకవైపు వాతావరణంలో చేసుకుంటున్న మార్పులు, మరొకవైపు ప్రైవేటు వ్యాపారులు అతి తక్కువ ధరకే కొనుగోలుకు దిగటంతో రైతులు సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజాపాలనలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కి పెద్ద బీరవల్లి సొసైటీకి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంజూరు చేయాలని సొసైటీ పరిధిలో గల రైతులు వినతి పత్రం అందించారు. అయితే కలెక్టర్ అన్నదాతలకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రం మంజూరు చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వకుండా పరిశీలిస్తామని చెప్పారు.

అయితే సోమవారం రావినూతల, ముష్టికుంట్ల అన్నదాతలు ఆందోళన నిర్వహించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సాధించుకోవడంతో వారి స్ఫూర్తితో పెద్ద బీరవల్లి సొసైటీ పరిధిలోని అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. వైరా – జగ్గయ్యపేట ప్రధాన రహదారిపై మధిర క్రాస్ రోడ్డు వద్ద రాస్తారోకోకు దిగారు. దీంతో వైరా – జగ్గయ్యపేట, వైరా – మధిర ప్రధాన రహదారిపై సుమారు నాలుగు కిలోమీటర్ల మేర భారీగా రెండు గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న బోనకల్ ఎస్సై పొదిలి వెంకన్న హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పెద్ద బీరవల్లి సర్పంచ్ చింతలచెరువు కోటేశ్వరరావు, సీతానగరం రైతులు చిలక నాగరాజు, చిలక దాసు తదితరులతో చర్చలు జరిపారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు ఆందోళన విరమించేది లేదని ఎస్సై కు వారు స్పష్టం చేశారు. ఆందోళన ఫలితంగా భారీగా వాహనాలు నిలిచిపోయాయని, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన విరమించాలని ఎస్సై వారిని కోరారు. అయినా అన్నదాతలు అంగీకరించలేదు. నాలుగైదు సార్లు ఎస్సై అన్నదాతలను అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా రైతులు అడ్డుకున్నారు. ఓ గంట తర్వాత మండల వ్యవసాయ శాఖ అధికారి పసునూరి వినయ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకున్నారు.

పెద్ద బీరవల్లి సొసైటీకి మొక్కజొన్న కొనుగోలు కేంద్రం మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కి తాము నివేదిక పంపించామని త్వరలో మంజూరు వస్తుందని అన్నదాతలకు తెలిపారు. దీంతో అన్నదాతలు జిల్లా కలెక్టర్ గాని మార్క్ఫెడ్ డిఎం గాని  కొనుగోలు కేంద్రాన్ని మంజూరు చేస్తున్నట్లు ప్రకటిస్తేనే ఆందోళన విరమిస్తామని భీష్మించి కూర్చున్నారు. మార్క్ఫెడ్ డి ఎం ఐలోని శ్యామ్ కుమార్ కు మండల వ్యవసాయ శాఖ అధికారి ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. రెండు గంటల ఆందోళన అనంతరం మార్క్ఫెడ్ డిఎం శ్యాం కుమార్ స్పందించి పసునూరి వినయ్ కుమార్ కు ఫోన్ చేశారు. పసునూరి వినయ్ కుమార్ లౌడ్ స్పీకర్ పెట్టి మార్క్ఫెడ్ డిఎం మాట్లాడే విషయాలను రైతులకు వినిపించారు. పెద్ద బీరవల్లి సొసైటీకి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంజూరు చేస్తున్నట్లు మార్క్ఫెడ్ డి ఎం ప్రకటించారు. దీంతో అన్నదాతలు తమ ఆందోళన విరమించారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంజూరు చేస్తున్నట్లు డిఎం ప్రకటించడంతో అన్నదాతలు విజయం సాధించామనే ఆనందంతో కేరింతలు కొట్టుకుంటూ ఆందోళన విరమించడం విశేషం. ఈ కార్యక్రమంలో పెద్ద బీరవల్లి సొసైటీ పరిధిలోనే అన్నదాతలు పెద్దపోలు రామారావు, పెద్దపోలు కోటేశ్వరరావు, ఆళ్ల ప్రసాద్, చిలక నాగరాజు, కటారి నాగేశ్వరరావు, చిలక దాసు, ఆళ్ల లాయర్ బాబు, ఆళ్ళ మోహన్ రావు, ఎనమద్ది వెంకటేశ్వర్లు, మేకల శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు.

filter: 0; fileterIntensity: 0.000000; filterMask: 0; captureOrientation: 0;
hdrForward: 6; shaking: 0.000792; highlight: 1; algolist: 0;
multi-frame: 1;
brp_mask: 8;
brp_del_th: 0.0000,0.0000;
brp_del_sen: 0.0000,0.0000;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (0.63083315, 0.5052082);sceneMode: 7864320;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: null;temperature: 40;
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -